చరిత్రను తిరగరాసే పథకం దళిత బంధు : హరీశ్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో : అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా తెలంగాణ దళిత బంధు పథకం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన సీఎం కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని అభిప్రాయపడ్డారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోట ఇవ్వడం […]

Update: 2021-08-16 07:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా తెలంగాణ దళిత బంధు పథకం అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన సీఎం కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని అభిప్రాయపడ్డారు.

10 లక్షల రూపాయల ఆర్థిక సహాయమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులు, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోట ఇవ్వడం దేశ చరిత్రలో ప్రథమం కావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ విప్లవం ముందుకు సాగుతుందని వెల్లడించారు.

 

Tags:    

Similar News