కమర్షియల్ పంటలపై దృష్టి సారించాలి : హరీశ్ రావు

దిశ, మెదక్: కాలం కోసమో.. కరెంటు కోసమో.. ఎదురు చూపులు చూడకుండా కాల్వల నీళ్లతో మూడు పంటలు తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అప్పలాయ చెరువు కుంట మత్తడి దూకడం, ముండ్రాయి గ్రామంలోని యజ్ఞం కుంట నిండటంతో ఆదివారం సాయంత్రం గోదావరి జలాలతో నిండిన చెరువు, కుంటల్లో గంగమ్మ తల్లికి ఫుష్పాభిషేకం చేసి, జల హారతి పట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి రైతూ […]

Update: 2020-05-10 09:48 GMT

దిశ, మెదక్: కాలం కోసమో.. కరెంటు కోసమో.. ఎదురు చూపులు చూడకుండా కాల్వల నీళ్లతో మూడు పంటలు తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అప్పలాయ చెరువు కుంట మత్తడి దూకడం, ముండ్రాయి గ్రామంలోని యజ్ఞం కుంట నిండటంతో ఆదివారం సాయంత్రం గోదావరి జలాలతో నిండిన చెరువు, కుంటల్లో గంగమ్మ తల్లికి ఫుష్పాభిషేకం చేసి, జల హారతి పట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రతి రైతూ లక్షాధికారి కావాలనేదే నా కోరిక అని హరీశ్ రావు అన్నారు. భూమిని నమ్ముకుని బతికితే ఆరోగ్యంగా బతకొచ్చున్నారు. ఇక నుంచి రైతులు కమర్షియల్ పంటలపై దృష్టి సారించాలన్నారు. సన్నరకం వడ్లు పండించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రోహిణి కార్తెలో నార్లు పోసి అధిక దిగుబడి పొందాన్నారు. ప్రతిఏటా తప్పనిసరిగా మూడు పంటలు తీయాలన్నారు. ‘మీ ఏ కష్టమొచ్చినా.. నేను అండగా ఉన్నాను‘ అని అన్నారు. జూన్ 10వ తేదీలోపు రూ.7వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాలని సీఏం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. మొదటి దశలోని రైతుబంధు రూ.3500 కోట్లు విడుదల చేశామన్నారు. కరువు అనేది ఇక మన డిక్షనరీలో ఉండదన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..