సంగారెడ్డి జిల్లాలో మరో కరోనా పాజిటివ్

దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సాయి కృప కాలనీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెంటనే మంత్రి హరీశ్‌‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మయూరినగర్, సాయికృపనగర్‌లో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. […]

Update: 2020-04-13 01:30 GMT

దిశ, మెదక్ : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సాయి కృప కాలనీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. వెంటనే మంత్రి హరీశ్‌‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావులతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మయూరినగర్, సాయికృపనగర్‌లో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్టు తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో ఎవరైనా కంటాక్ట్స్ కలిగి ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. కరోనా ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా 7702411150 నెంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Tags: Minister Harish rao, inspects,continement Area

Tags:    

Similar News