పోలీస్ కమిషనరేట్‌లో హరీశ్‌రావు

దిశ, సిద్ధిపేట: కొత్త పోలీసు కమిషనరేట్ అసంపూర్తి పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశించారు. రాజీవ్ రహదారిపై ఆనుకుని కమిషనరేట్ వచ్చేలా దారి అంశంపై పోలీసు అధికారులతో చర్చించారు. ఏడున్నర ఎకరాలలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనుల గురించి మంత్రి ఆరా తీశారు. కమిషనరేట్ భవనంలోని కార్యాలయాల సుముదాయాల గదులను బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలిస్తూ.. […]

Update: 2020-08-16 01:20 GMT

దిశ, సిద్ధిపేట: కొత్త పోలీసు కమిషనరేట్ అసంపూర్తి పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆదేశించారు. రాజీవ్ రహదారిపై ఆనుకుని కమిషనరేట్ వచ్చేలా దారి అంశంపై పోలీసు అధికారులతో చర్చించారు. ఏడున్నర ఎకరాలలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనుల గురించి మంత్రి ఆరా తీశారు.

కమిషనరేట్ భవనంలోని కార్యాలయాల సుముదాయాల గదులను బ్లాకులు, అంతస్తుల వారీగా పరిశీలిస్తూ.. కమిషనరేట్ కలియ తిరిగారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అత్యాధునిక సదుపాయాలతో ప్రజల సౌలభ్యం కోసం సౌకర్యార్థం నూతన కమిషనరేట్ నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లు వివరించారు. ఈ మేరకు పలు అసంపూర్తి నిర్మాణ పనులపై ఆరా తీసి పోలీసు కమిషనరేట్ ఆవరణలో హరితహారం సుందరీకరణ చేసి ఎక్సలెంట్ బ్యూటిఫికేషన్ వచ్చేలా.. సుందరంగా తీర్చిదిద్దాలని అధికారిక యంత్రాంగాన్ని ఆదేశించారు. మిగులు పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టరుకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News