చెక్ డ్యాం లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి హరీష్ రావు

దిశ సిద్దిపేట: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఖాతా – 2, దర్గపల్లి చెక్ డ్యాములను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని చెక్ డ్యాములు, కాలువ పనులను గురువారం ఉదయం ఇరిగేషన్ ఏస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ, డీఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజాలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అక్కడికక్కడే నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. […]

Update: 2021-05-27 05:45 GMT

దిశ సిద్దిపేట: వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఖాతా – 2, దర్గపల్లి చెక్ డ్యాములను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని చెక్ డ్యాములు, కాలువ పనులను గురువారం ఉదయం ఇరిగేషన్ ఏస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ, డీఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజాలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అక్కడికక్కడే నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఖాతా గ్రామం ఎల్డీ-10లో కొనసాగుతున్న సైఫాన్ కాలువ నిర్మాణ పనులు, కొత్తగా నిర్మిస్తున్న చెక్ డ్యాము పనులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. రంగనాయక సాగర్ జలాశయం ఆర్ఏంసీ- కుడి కాలువ ద్వారా వచ్చే నీరు, వాటి నీటి లభ్యత పై, ఎల్డీ 10 పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.

గతేడాది నంగునూరు మండలంలోని ఖాతా గ్రామంలో పెద్దవాగుపై దాదాపు రూ.10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాము పరిశీలించారు. అలాగే దర్లపల్లి గ్రామంలో సిద్ధిపేట వాగుపై చెక్ డ్యాము నిర్మాణ పనులు పరిశీలించగా, ముమ్మరంగా సాగుతున్నాయని ఇరిగేషన్ ఈఈ గోపాలకృష్ణ మంత్రికి వివరించారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఖాతా – 2, దర్గపల్లి చెక్ డ్యాములను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. నంగునూరు మండలంలోని వాగు అవతలి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ మండల ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. ఖాతాలోని ఎల్డీ 10లో సైఫాన్ ఆకారంలో నిర్మిస్తున్న కాలువ పనులు జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆ ప్రాంతంలో సుమారు 22 కిలో మీటర్ల మేర చేపడుతున్న కాలువ పనులపై అధికారులు, కాంట్రాక్టరుతో చర్చించారు. ఖాతా గ్రామంలో దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న దారం తిరుపతి రెడ్డి క్షేత్రం వద్ద చెక్ డ్యామును, సందిటి వెంకట్ రెడ్డి క్షేత్రం వద్ద నిర్మిస్తున్న మరో చెక్ డ్యాము పనులను పర్యవేక్షించి పనులు ముమ్మరం చేయాలని ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టరును ఆదేశించారు. కాల్వలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు తదితరాలన్నీ నిండేలా కావాల్సిన కార్యాచరణ పై ఇరిగేషన్ అధికారులతో చర్చించి, పలు ప్రధాన కాలువ, నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులు మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విషయమై ఎల్ఏంసీ- ఎడమ కాలువ పై అసంపూర్తి పనులన్నీ ముమ్మరంగా సాగుతున్నాయని ఇరిగేషన్ అధికారులు మంత్రికి వివరించారు.

అనంతరం నంగునూరు మండలం దర్లపల్లి గ్రామంలో ఆసర్ల యాదయ్య క్షేత్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న చెక్ డ్యాము పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు సిద్ధిపేట వాగుపై ఇప్పటికే 27 చెక్ డ్యాములు ఉండగా, దర్గ కొత్త చెక్ డ్యాము కలుపుకుని మొత్తం 28 చెక్ డ్యాములు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా నంగునూరు మండలంలోని పెద్ద వాగు-మోయ తుమ్మెద వాగుపై ఇప్పటికే 7 చెక్ డ్యాములు ఉండగా, ఖాతా గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న 2 చెక్ డ్యాములు కలుపుకుని మొత్తం 9 చెక్ డ్యాములు ఉన్నాయని., దీంతో నంగునూరు మండలంలోని వాగు పరివాహక ప్రాంతమంత జీవనదిగా మారనున్నదని మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News