హుజురాబాద్‌కు ట్రబుల్ షూటర్.. ఈటల సవాల్ స్వీకరించేనా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మూడు రోజుల కిందట మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ సవాల్ విసిరారు. అనూహ్యంగా అక్కడికి ఓ మంత్రి పర్యటన ఖరారైంది. అయితే, ఈ టూర్ వెనక కారణాలు ఏమైనా ఈటల డిమాండ్ చేసిన తరువాతే ఆ మంత్రి పర్యటన ఫిక్స్ కావడం గమనార్హం. మూడు రోజుల కిందట బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ మండలం చెల్పూరులో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు లకు సవాల్ విసిరారు. మంత్రి […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మూడు రోజుల కిందట మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఓ సవాల్ విసిరారు. అనూహ్యంగా అక్కడికి ఓ మంత్రి పర్యటన ఖరారైంది. అయితే, ఈ టూర్ వెనక కారణాలు ఏమైనా ఈటల డిమాండ్ చేసిన తరువాతే ఆ మంత్రి పర్యటన ఫిక్స్ కావడం గమనార్హం. మూడు రోజుల కిందట బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ మండలం చెల్పూరులో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు లకు సవాల్ విసిరారు. మంత్రి హరీష్ రావు వస్తావా..? సీఎం కేసీఆర్ వస్తావా..? అంటూ చాలెంజ్ చేశారు.
అయితే, ఇప్పటివరకు హుజురాబాద్ వైపు రాని హరీష్ రావు బుధవారం రానుండటంతో ఈటల వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. ఇప్పటివరకు సిద్దిపేట, రంగనాయక సాగర్, హైదరాబాద్‌ల నుండే మంత్రాంగం నడిపిన మంత్రి హరీష్ రావు మొట్టమొదటి సారిగా హుజురాబాద్ టూర్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇంతకాలం హుజురాబాద్‌కు రాని మంత్రి అనూహ్యంగా రావడం వెనక ఈటల సవాల్‌ను స్వీకరించే వస్తున్నారా అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు స్థానికులు. బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల మీదుగా టూరు సాగనుంది. ఈ సందర్భంగా బైక్ ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి హరీష్ ఈటలా… ఈ రోజు నేనొచ్చా… నాలుగు రోజుల్లో నా మామ కూడా వస్తున్నాడు అంటూ ప్రసంగిస్తారేమోనని అనుకుంటున్నారు కొందరు.