వాహనదారులకు హరీశ్‌రావు క్లాస్‌

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిస్తున్న క్రమంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా లాక్‌డౌన్ ప్రకటించినా… అక్కడక్కడా కొందరు బయటకు వస్తూనే ఉన్నారు. దీంతో స్వయంగా మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి వాహనదారులకు క్లాస్ ఇచ్చారు. సిద్దిపేటలో ద్విచక్ర వాహనదారులు వెళుతుండటాన్ని గమనించి ఆపారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్‌ నివారణకు మందు లేదు.. స్వీయ నిర్బంధం.. భౌతిక దూరం పాటించడమే సమస్యకు పరిష్కారం. ఈ వైరస్‌ నుంచి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్టుగా […]

Update: 2020-03-30 19:58 GMT

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిస్తున్న క్రమంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా లాక్‌డౌన్ ప్రకటించినా… అక్కడక్కడా కొందరు బయటకు వస్తూనే ఉన్నారు. దీంతో స్వయంగా మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి వాహనదారులకు క్లాస్ ఇచ్చారు. సిద్దిపేటలో ద్విచక్ర వాహనదారులు వెళుతుండటాన్ని గమనించి ఆపారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా వైరస్‌ నివారణకు మందు లేదు.. స్వీయ నిర్బంధం.. భౌతిక దూరం పాటించడమే సమస్యకు పరిష్కారం. ఈ వైరస్‌ నుంచి ప్రపంచమే గడగడలాడుతోంది. మీరేమో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు’అని మండిపడ్డారు. అధికారులు ప్రమాదం పొంచి ఉం దని తెలిసినా లెక్క చేయకుండా మీ కోసం పని చేస్తున్నా.. సహకరించడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. వైఖరి మార్చుకోకపోతే కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు.

Tags : Finance Minister Harish Rao, Counseling, Motorists, Road, medak

Tags:    

Similar News