‘సాగునీటి రంగంలో పెను మార్పులు’
దిశ, న్యూస్ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో పెను మార్పులు తీసుకురాగలిగామని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు తాగు,సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం కష్టపడుతున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 146 చెక్‌డ్యాంలు మంజూరు చేశామన్నారు. 53 చెక్ డ్యాంలు పూర్తిచేసినట్టు తెలిపారు. చెక్ డ్యాంల కింద 56.776 ఎకరాల ఆయకట్టు సాగుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూ.3825 కోట్ల అంచనా వ్యయంతో […]
దిశ, న్యూస్ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంలో పెను మార్పులు తీసుకురాగలిగామని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు తాగు,సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో సీఎం కష్టపడుతున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత 146 చెక్‌డ్యాంలు మంజూరు చేశామన్నారు. 53 చెక్ డ్యాంలు పూర్తిచేసినట్టు తెలిపారు. చెక్ డ్యాంల కింద 56.776 ఎకరాల ఆయకట్టు సాగుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూ.3825 కోట్ల అంచనా వ్యయంతో భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల ప్రవాహాలపై 4వ ఆర్డర్ నుంచి 8వ ఆర్డర్ వరకు 1200 చెక్ డ్యాంలు నిర్మాణాల కోసం పరిపాలన పరమైన అనుమతులను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రతీ నీటి చుక్క ఒడిసి పట్టాలన్నదే ధ్యేయం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్రానికి వచ్చే 1253 టీఎంసీల నీటి హక్కును ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోకపోవడం వల్ల నీరంతా సముద్రం పాలయిందన్నారు. చెక్ డ్యాంల నిర్మాణం నిరంతర ప్రక్రియ పొడవాటి నీరు ఉన్నచోట ఏడాదంతా నీరు నిలువ ఉండాలన్న ఉద్దేశంతో చెక్ డ్యాంల నిర్మాణాలు చేపడుతున్నమన్నారు. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో చెక్ డ్యాంల నిర్మాణం చేపడతమని తెలిపారు. చెక్ డ్యాంల వల్ల అనేక లాభాలున్నయన్నారు. దాదాపు 3లక్షల ఎకరాలకు సాగు నీరు అందించొచ్చని తెలిపారు. గ్రౌండ్ వాటర్ చెక్ డ్యాం పరిధిలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పెరుగుతుందన్నారు. 1200 చెక్ డ్యాంలలో ఈ ఆర్థిక సంవత్సరంలో 600, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 600 చెక్ డ్యాంలు నిర్మాణం చేస్తామన్నారు.
Tags : minister harish rao, cm kcr, Check dam, Krishna, Godavari, Irrigation