అంబేద్కర్ ఆశయాల కోసం పని చేద్దాం : మంత్రి హరీష్ రావు

దిశ, మెదక్ : అంబేద్కర్ ఆశయాలు, కలలుగన్న సమాజం కోసం పనిచేద్దామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఆత్మ గౌరవానికి, పోరాటానికి, విజ్ఞానానికి నిదర్శనమన్నారు. కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ […]

Update: 2020-04-14 05:43 GMT

దిశ, మెదక్ :

అంబేద్కర్ ఆశయాలు, కలలుగన్న సమాజం కోసం పనిచేద్దామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఆత్మ గౌరవానికి, పోరాటానికి, విజ్ఞానానికి నిదర్శనమన్నారు. కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొనడమే కాకుండా, దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.

Tags: corona, lockdown, minister harish nagar, ambedkar jayanthi, siddipet

Tags:    

Similar News