‘టీఆర్ఎస్ మంచితనం అసమర్థత కాదు’
దిశ, కరీంనగర్ సిటీ: టీఆర్‌ఎస్ మంచితనాన్ని ఇతర పార్టీలు అసమర్థతగా భావిస్తున్నాయని, వాటికి తగిన గుణపాఠం చెబుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని, వారిని పార్టీ విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరాశకు లోను కాకుండా వేచిచూస్తే అవకాశాలు లభిస్తాయన్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు లోనైతే, వారి భవిష్యత్ […]
దిశ, కరీంనగర్ సిటీ: టీఆర్‌ఎస్ మంచితనాన్ని ఇతర పార్టీలు అసమర్థతగా భావిస్తున్నాయని, వాటికి తగిన గుణపాఠం చెబుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని, వారిని పార్టీ విస్మరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిరాశకు లోను కాకుండా వేచిచూస్తే అవకాశాలు లభిస్తాయన్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు లోనైతే, వారి భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. పార్టీకి విధేయులైన వారికి పదవులు రావటం తథ్యమన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. లక్ష్యాన్ని మించి పార్టీ సభ్యత్వాలు పూర్తి చేస్తామని తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రవిశంకర్, సతీష్ కుమార్, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.