మంత్రి గంగుల సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విధంగా ప్రతీ కమ్యూనిటీ నుండి ఏక సంఘంగా ఏర్పడిన వారికి వెంటనే ఆత్మగౌరవ భవన నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటి పర్యవేక్షణ బాధ్యతలు […]

Update: 2021-11-01 03:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ భవనాలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విధంగా ప్రతీ కమ్యూనిటీ నుండి ఏక సంఘంగా ఏర్పడిన వారికి వెంటనే ఆత్మగౌరవ భవన నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటి పర్యవేక్షణ బాధ్యతలు సైతం వారికే అప్పగించాలని మంత్రి గంగుల సూచించారు.

మిగతా సంఘాలతో సైతం నవంబర్ 8న సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కోకాపేట, ఉప్పల్ బగాయత్, బాటసింగారంలలో 40 కులాలకు, 82.30 ఎకరాలను దాదాపు రూ.100 కోట్ల నిధులను కేటాయించిన ప్రభుత్వం త్వరలోనే వీటిలో నిర్మాణాలను అత్యంత వేగంగా వీటిని పూర్తి చేయడానికి బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బుర్రా వెంకటేశం మంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బీసీ గురుకులాల్లోని వసతులు, కరోనా సంరక్షణ చర్యలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. హాస్టళ్లు, భోజనశాలతో పాటు క్లాస్ రూంలలో తగిన ఏర్పాట్లు చేశామని, ఎలాంటి ఆటంకాలు లేకుండా గురుకులాలను నిర్వహిస్తున్నామని ఎంజేపీ సెక్రటరీ మల్లయ్య బట్టు వెల్లడించారు.

Tags:    

Similar News