అడ్డంగా బుక్కైన మంత్రి గంగుల.. ఆయన ఏమన్నాడంటే.?
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో మంత్రుల తీరు వివాదాలకు దారి తీస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఎంపీడీవోపై ‘మేడం బాగానే ఊపుతున్నావ్’ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన మరువకముందే విద్యార్థి, అధికారిపై మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఆయన తీరుపై విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘చూత్యే […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో మంత్రుల తీరు వివాదాలకు దారి తీస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఎంపీడీవోపై ‘మేడం బాగానే ఊపుతున్నావ్’ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన మరువకముందే విద్యార్థి, అధికారిపై మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేస్తున్నాయి. ఆయన తీరుపై విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధులంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘చూత్యే నా కొడుకులు.. వాన్నో రెండు సంపు’ అంటూ మరో మంత్రి తన అసహనాన్ని ప్రదర్శించిన ఘటన కరీంనగర్‌లో సంచలనంగా మారింది. (ఇంతకీ ఆయన ఏం అన్నారంటే.. వీడియో కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.)
కరీంనగర్‌లోని SRR కాలేజ్ ఆవరణలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావులతో పాటు పలువురు వెళ్లారు. ఈ విషయం తెలిసి ఓ విద్యార్థి.. మంత్రి గంగులతో అభ్యంతరం వ్యక్తం చేశారు. SRR కాలేజీ కాంపౌండ్ లో ఉన్న ఈ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి విద్యార్థితో దుసురుగా ప్రవర్తించారు. నీ ఊరు ఎక్కడ ఈ స్థలం SRR కాలేజీది కాదు.. స్పోర్ట్స్ అథారిటీకి చెందినది అని మంత్రి గంగుల కమలాకర్ కోపం ప్రదర్శించారు. ‘వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లండి రెండు సంపండి..’ అంటూ పోలీసులను పురమాయించడం కలకలం సృష్టించింది. అంతేకాకుండా అక్కడే ఉన్న ఓ అధికారితో ‘నీకేమీ తెల్వదు. నోరు మూసుకో’ అని అనడం సంచలనంగా మారింది.
మంత్రి హోదాలో ఉన్న గంగుల మాట్లాడిన తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి నిర్మాణాలు చేపట్టాల్సింది పోయి వారిపైనే దురుసుగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. (ఇది కూడా చదవండి: మేడం.. బానే ఊపుతున్నావ్! మహిళా ఎంపీడీఓపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు)
ఇది కూడా చదవండి: