డెడ్ బాడీలను ఊళ్లల్లోకి రానివ్వకపోవడం బాధాకరం : ఈటల

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా మృతదేహాలను గ్రామాల్లోకి రానివ్వకపోవడం చాలా బాధాకరమంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తంచేశారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్సార్ గార్డెన్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతోందని, లక్ష కరోనా కిట్లు, పూర్తిస్థాయి మందులు, మాస్క్‌లు, పీపీఈ […]

Update: 2020-07-28 10:13 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: కరోనా మృతదేహాలను గ్రామాల్లోకి రానివ్వకపోవడం చాలా బాధాకరమంటూ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విచారం వ్యక్తంచేశారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్సార్ గార్డెన్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..సర్కార్ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందుతోందని, లక్ష కరోనా కిట్లు, పూర్తిస్థాయి మందులు, మాస్క్‌లు, పీపీఈ కిట్స్ అందుబాటులో ఉన్నాయని వివరించారు. వరంగల్ ఎంజీఎంలో ఉన్న 250 పడకల కరోనా వార్డుతో పాటు కేఎంసీలోని పీఎం‌ఎస్‌హెచ్ఓ బిల్డింగ్‌లో మరో పది రోజుల్లో 250 బెడ్స్ అందుబాటులోకి తెస్తామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా బారిన పడిన వాళ్లను గుర్తించేందుకు ర్యాపిడ్ టెస్ట్‌లు వాడుతున్నట్లు చెప్పారు. ఆశావర్కర్లు నిత్యం చేస్తున్న సర్వేలతో కరోనా లక్షణాలు ఉన్న వాళ్లను గుర్తించి టెస్టులు చేయిస్తున్నామన్నారు. కరోనాతో చనిపోతే ప్రజలు శ్మశానవాటికలకు రానివ్వడం లేదని, కల్లోలం వచ్చినట్లు భయపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇతర కారణాలతో చనిపోయినా కూడా అనుమానంతో వారిని ఊళ్లోకి రానివ్వకపోవడం బాధకరమన్నారు. అలాంటి బాడీలకు మున్సిపాలిటీల ద్వారా అంత్యక్రియలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జీహెచ్ఎంసీ తరహాలో జీడబ్ల్యూఎంసీ చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు అవసరమైన సిబ్బందిని స్థానికంగా నియమించుకోవాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది తమ కుటుంబాలను పక్కన పెట్టి కర్తవ్య నిర్వహణ చేస్తున్నారని, రక్తసంబంధీకులే పట్టించుకోని పరిస్థితిలో కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్న డాక్టర్లను అభినందించాల్సి పోయి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News