కరోనా నియంత్రణ చర్యలు వేగవంతం కావాలి: ఈటల

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక దశలోనే కట్టడి చేయడం చాలా అవసరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించి ఐసోలేట్ చేయాలని, ఇందుకోసం నిఘా, పర్యవేక్షణ మరింత పెంచాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ నూతన కార్యదర్శిగా నియమితులైన ముర్తజా రిజ్వీతో మంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు […]

Update: 2020-07-16 11:17 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ ఎత్తివేయడంతో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక దశలోనే కట్టడి చేయడం చాలా అవసరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించి ఐసోలేట్ చేయాలని, ఇందుకోసం నిఘా, పర్యవేక్షణ మరింత పెంచాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ నూతన కార్యదర్శిగా నియమితులైన ముర్తజా రిజ్వీతో మంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు చేపట్టిన నియంత్రణా చర్యలతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై కార్యదర్శికి మంత్రి దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది ఉండాలని, ప్రజల అవసరాలకు తగిన తీరులో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని నొక్కిచెప్పారు. పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తిచేసినవారందరినీ సీనియర్ రెసిడెంట్‌లుగా నియమించి వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వాటిని అంతే పకడ్బందీగా క్షేత్ర స్థాయి వరకు అమలు జరిగేలా చూడాలని రిజ్వీకి మంత్రి సూచించారు. ఆసుపత్రులకు సంబందించిన, సిబ్బందికి సంబంధించిన అన్ని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నొక్కిచెప్పారు.

Tags:    

Similar News