కేంద్ర వైద్యశాఖతో మంత్రి ఈటల చర్చలు

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబేతో మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో చర్చలు జరిపారు. వెయ్యి వెంటిలేటర్స్ అడిగితే ఇంతవరకు పంపించలేదని, వెంటనే రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని ప్రారంభించామని, పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు త్వరగా అందేలా చూడాలని ఈటల చెప్పగా.. త్వరలోనే హెచ్‌సీఎల్‌ నుంచి అందేలా చూస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే […]

Update: 2020-04-20 06:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర వైద్యశాఖ సహాయమంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబేతో మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో చర్చలు జరిపారు. వెయ్యి వెంటిలేటర్స్ అడిగితే ఇంతవరకు పంపించలేదని, వెంటనే రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని ప్రారంభించామని, పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు త్వరగా అందేలా చూడాలని ఈటల చెప్పగా.. త్వరలోనే హెచ్‌సీఎల్‌ నుంచి అందేలా చూస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులు సేకరిస్తుందని, ఇదే క్రమంలో కేంద్రం సాయం చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని మంత్రి ఈటల పేర్కొన్నారు.

tags: Union Ministry of Health, Ashwin Kumar Choubey, Minister Etela Rajender, Telangana, Gachibowli 1500 beds hospital, Hyderabad

Tags:    

Similar News