విమానాల్లో ఆక్సిజన్ తరలిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమానాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఈ మేరకు ఈటల ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి ప్రభుత్వం వినూత్న పద్దతి ఎంచుకుందని అన్నారు. రక్షణ విమానాలను ప్రాణవాయువు తరలింపుకు వినియోగించిన తొలి రాష్ట్రంగా దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయం నుంచి 8 ట్యాంకర్లను […]

Update: 2021-04-24 01:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమానాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఈ మేరకు ఈటల ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి ప్రభుత్వం వినూత్న పద్దతి ఎంచుకుందని అన్నారు. రక్షణ విమానాలను ప్రాణవాయువు తరలింపుకు వినియోగించిన తొలి రాష్ట్రంగా దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయం నుంచి 8 ట్యాంకర్లను ఒడిశాకు పంపడంతో రవాణా సమయం 6 నుంచి 3 రోజులకు తగ్గనుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖ సహకారంతో సి-17 యుద్ద విమానాలను వాడి ఆక్సిజన్ తరలింపును చేపట్టిందని చెప్పారు.


Similar News