15శాతం పైగా మరణాలు ఆ వ్యాధితోనే

దిశ ప్రతినిధి,హైదరాబాద్: రాష్ట్రంలో 15 శాతానికి పైగా మరణాలు క్యాన్సర్ కారణంగా చోటు చేసుకుంటున్నాయనీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహనా మాసోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘‘గ్రేస్ క్యాన్సర్ రన్’’కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాంకేతిక, శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ జీవనశైలి, ఆహారపు […]

Update: 2020-10-12 06:44 GMT

దిశ ప్రతినిధి,హైదరాబాద్: రాష్ట్రంలో 15 శాతానికి పైగా మరణాలు క్యాన్సర్ కారణంగా చోటు చేసుకుంటున్నాయనీ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహనా మాసోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘‘గ్రేస్ క్యాన్సర్ రన్’’కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాంకేతిక, శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, తీవ్ర మైన మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ నివారణ, చికిత్స సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే స్వయంగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి ఈటల వెల్లడించారు.

Tags:    

Similar News