పల్లె ప్రగతి స్ఫూర్తి కొనసాగించాలి: మంత్రి ఎర్రబెల్లి

దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో సోమవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రకటించిన రూ. 5 వేల ప్రోత్సాహకం ఖాతాల్లో జమ అయ్యాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కారణంగానే ఈరోజు కరోనా వైరస్ కట్టడిలో ఉందన్నారు. కరోనా నివారణకు వైద్యులు, పోలీసులు, అధికారులకు దీటుగా […]

Update: 2020-04-13 00:08 GMT

దిశ, వరంగల్: సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పల్లె ప్రగతి స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో సోమవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రకటించిన రూ. 5 వేల ప్రోత్సాహకం ఖాతాల్లో జమ అయ్యాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కారణంగానే ఈరోజు కరోనా వైరస్ కట్టడిలో ఉందన్నారు. కరోనా నివారణకు వైద్యులు, పోలీసులు, అధికారులకు దీటుగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నట్టు కొనియాడారు. వారి సేవలను ప్రభుత్వం, ప్రజలు ఎప్పటికీ మరవలేరన్నారు.

Tags: Minister Errabelly,warangal,sanitation workers

Tags:    

Similar News