ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన
దిశ ప్రతినిధి, వరంగల్: నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శిస్తూ.. రెస్క్యూ టీంలతో కలిసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని మైసయ్య నగర్, రామన్నపేట రెండు వీధులు, సంతోషిమాత గుడి కాలనీ తదితర ముంపు ప్రాంతాలను మంత్రి సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు భోజన సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, రాష్ట్ర మహిళా సాధికారత […]
దిశ ప్రతినిధి, వరంగల్: నగరంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దాయకర్ రావు పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శిస్తూ.. రెస్క్యూ టీంలతో కలిసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని మైసయ్య నగర్, రామన్నపేట రెండు వీధులు, సంతోషిమాత గుడి కాలనీ తదితర ముంపు ప్రాంతాలను మంత్రి సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు భోజన సదుపాయాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, రాష్ట్ర మహిళా సాధికారత సంస్థ చైర్మన్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.