క‌రోనాపై భ‌యాందోళ‌న‌లు వద్దు : మంత్రి ఎర్రబెల్లి

దిశ, వరంగల్: క‌రోనా వైర‌స్‌పై ప్రజలు భయాందోళనకు గురవ్వద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపార. గురువారం వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా క‌లెక్ట‌ర్లు, వైద్య‌, పోలీసు అధికారుల‌తో ఆయన టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, తాజా ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. అధికారులందరూ సహ‌నం, సంయ‌మ‌నంతో ప‌ని చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లాలో ఒక్క క‌రోనా కేసు నమోదు కాలేదు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఉమ్మ‌డి […]

Update: 2020-04-02 09:38 GMT

దిశ, వరంగల్: క‌రోనా వైర‌స్‌పై ప్రజలు భయాందోళనకు గురవ్వద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపార. గురువారం వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా క‌లెక్ట‌ర్లు, వైద్య‌, పోలీసు అధికారుల‌తో ఆయన టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, తాజా ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. అధికారులందరూ సహ‌నం, సంయ‌మ‌నంతో ప‌ని చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్ జిల్లాలో ఒక్క క‌రోనా కేసు నమోదు కాలేదు. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌ను సీరియ‌స్‌గా పాటిస్తున్నారన్నారు. కొంద‌రు వ్యక్తులు ఢిల్లీలో జ‌రిగిన జ‌మాత్ కు హాజ‌రై గుట్టు చ‌ప్పుడు కాకుండా వారి ఇళ్ళ‌కు చేరార‌న్నారు. వాళ్లంద‌రినీ గుర్తించి వెంట‌నే ప్ర‌భుత్వ క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించామని చెప్పారు. అయితే వాళ్ళ‌ల్లో కొంద‌రికి ఆ వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌కు క‌నిపించ‌న‌ప్ప‌టికీ, పాజిటివ్ వ‌చ్చిన‌ట్టుగా వ‌స్తున్న వార్త‌ల‌తో ప్ర‌జ‌లు భయాందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ప‌రీక్ష‌లు నిర్వహించి అనుమానితులను క్వారంటైన్, ఐసోలేష‌న్ సెంటర్లకు పంపించడానికి సిద్ధంగా ఉందన్నారు. కరోనా అనుమానితులు వెంట‌నే ప్ర‌భుత్వ క్వారంటైన్ సెంట‌ర్ల‌కు వెళ్లి స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు. తమంతట తాము రాకుండా ఉన్నవారిని గుర్తించి వాళ్ళ‌ను క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని అధికారులను కోరారు.పాజిటివ్ వ‌చ్చిన వారికి త‌గిన చికిత్స మ‌న వ‌ద్ద ఉందని, అందుకే చాలామంది కోలుకుని డిశ్చార్జీ అవుతున్నార‌ని చెప్పారు. కావున ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Tags : corona, minister errabelli dayakar, teleconference, collectors,

Tags:    

Similar News