‘ఇబ్బందులున్నా లాక్ డౌన్‌కు సహకరించాలి’

దిశ, వరంగల్: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరూ లాక్ డౌన్‌ను పాటించి, కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. కరోనా దెబ్బకు సంపన్న దేశాలే సతమతమవుతున్నాయనీ, ప్రపంచానికి కంటె ముందే మనం మేల్కొన్నామని తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు చేప‌ట్టిన ముందస్తు చర్యలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయని వెల్లడించారు. ఆయన భూపాల‌ప‌ల్లి జిల్లాలో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌, వ‌ల‌స కూలీల స్థితిగ‌తులు, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి […]

Update: 2020-03-30 04:24 GMT

దిశ, వరంగల్: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరూ లాక్ డౌన్‌ను పాటించి, కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. కరోనా దెబ్బకు సంపన్న దేశాలే సతమతమవుతున్నాయనీ, ప్రపంచానికి కంటె ముందే మనం మేల్కొన్నామని తెలిపారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లు చేప‌ట్టిన ముందస్తు చర్యలు మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయని వెల్లడించారు. ఆయన భూపాల‌ప‌ల్లి జిల్లాలో క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌, వ‌ల‌స కూలీల స్థితిగ‌తులు, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పలు కీల‌క‌ అంశాల‌పై సోమ‌వారం కలెక్ట‌ర్ స‌మావేశ మందిరంలో స‌మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం పండించిన ప్ర‌తి గింజ‌నూ కొనుగోలు చేయడానికి కేసీఆర్ నిర్ణ‌యించార‌నీ, ఇది చారిత్ర‌క నిర్ణ‌య‌మ‌ని కొనియాడారు. దీనివల్ల అన్న‌దాతకు ఎలాంటి ఇబ్బందులు రావ‌ని అభిప్రాయపడ్డారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చి క్వారంటైన్‌లో ఉన్నవారి వివరాలను తెలిపారు. ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేట‌ర్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి విధుల్లో పాల్గొంటున్న జిల్లా సిబ్బందికి కరోనా ప్రూఫ్ డ్రెస్సులు అంద‌జేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక మ‌హిళా సంఘాల ద్వారా మాస్క్‌ల త‌యారీని చేపట్టాలని సూచించారు. నిత్యావసర సరుకుల కృత్రిమ కొర‌త సృష్టిస్తే పీడీ యాక్టు కింద కేసులు పెట్టి, జ‌రిమానాలు విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. లాక్ డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వలస కూలీలను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటామ‌న్నారు. వారికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ స‌మీక్ష‌లో భూపాల‌ప‌ల్లి జెడ్పీ చైర్ ప‌ర్స‌న్ శ్రీహర్షిణి, ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి, క‌లెక్ట‌ర్ అబ్దుల్ అజీం, జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ‌, వ్య‌వ‌సాయ‌, మార్కెటింగ్, గిడ్డంగులు, ర‌వాణా, పోలీసు త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

tags: lockdown, Errabelli dayakar rao, review meeting, collectorate, bhupalpally, coronavirus,

Tags:    

Similar News