ఆ గ్రామంలో పర్యటించిన మంత్రి.. రూ.100 ఫైన్‌‌

దిశ, బాల్కొండా: నాల్గో విడత పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌ రెడ్డి, పంచాయత్‌ రాజ్‌‌‌ శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌‌లు వేల్పూర్‌‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదికను సందర్శించారు. అలాగే పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలోని ఓ కిరాణా షాపు ముందు చెత్త ఉండడాన్ని చూసిన మంత్రి ఎర్రబెల్లి షాప్ ఓనర్‌కు రూ.100 ఫైన్‌‌ విధించారు. ప్రజలకు, […]

Update: 2021-07-08 01:40 GMT

దిశ, బాల్కొండా: నాల్గో విడత పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌ రెడ్డి, పంచాయత్‌ రాజ్‌‌‌ శాఖ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్‌‌లు వేల్పూర్‌‌‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదికను సందర్శించారు. అలాగే పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలోని ఓ కిరాణా షాపు ముందు చెత్త ఉండడాన్ని చూసిన మంత్రి ఎర్రబెల్లి షాప్ ఓనర్‌కు రూ.100 ఫైన్‌‌ విధించారు. ప్రజలకు, షాపు యజమానులకు అవగాహన కోసమే ఈ ఫైన్ వేశామని మంత్రులు తెలిపారు.

Tags:    

Similar News