‘మేం ఊ అంటే.. బీజేపీ నేతలను ఉరికించి కొడుతరు’
దిశ ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ నేతలను హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు, నేతలు రాళ్లు, రప్పలు, ఇటుకలతో దాడి చేయడాన్ని ప్రజలందరూ ఖండించాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ నేతలు దాడులతో అలజడి సృష్టించాలని పక్కా ప్లానింగ్‌తో ఉన్నారని అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలుసుకున్న […]
దిశ ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బీజేపీ నేతలను హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ కార్యకర్తలు, నేతలు రాళ్లు, రప్పలు, ఇటుకలతో దాడి చేయడాన్ని ప్రజలందరూ ఖండించాలని కోరారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ నేతలు దాడులతో అలజడి సృష్టించాలని పక్కా ప్లానింగ్‌తో ఉన్నారని అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‌రావుతో కలిసి చల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఇది పిరికిపిందల చర్యగా పేర్కొన్నారు. వరంగల్‌లో ఏదో అలజడి సృష్టించి రాజకీయంగా బలపడాలని చూస్తోందని అన్నారు. దాడిలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి పాల్గొనడం హేయనీయమన్నారు. బీజేపీపై దాడులకు మేం పిలునిస్తే జనాలు ఉరికించుకుంటూ కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అధికార పార్టీగా తమపై బాధ్యత ఉన్నందున సంయమనంతో వ్యవహరిస్తున్నామని అన్నారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు విరాళాలు సేకరించొద్దని విశ్వహిందూ పరిషత్ స్పష్టంగా ప్రకటన చేసిందని అన్నారు. చోటామోటా నేతలతో బీజేపీ విరాళాల కోసం తిరగడం ఏమాత్రం బాగోలేదని అన్నారు. విరాళాలకు అకౌంటబులిటీ ఎక్కడా ఉండదని చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించడంలో ఎంతమాత్రం తప్పులేదని అన్నారు. హిందువులంటే తామేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని, రాజకీయ దురుద్దేశాలతో దాడులకు పాల్పడిటనట్లుగా స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. దాడి సమయంలో పోలీసులు సైతం సరైన విధంగా వ్యవహరించలేదని, వారి వైఫల్యం కూడా కనబడుతోందని అన్నారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, రాజయ్య సైతం బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.