వ‌చ్చే ఏడాది నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు అక్కడే!

దిశ, వరంగల్: రూర్బ‌న్ ప్రాజెక్టు, ప‌ర్వ‌త‌గిరి అభివృద్ధికి ప‌క్కాగా స‌రిపోతుంద‌ని, అన్నారం షరీఫ్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌లు రూపొందించినట్టు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. రూర్బ‌న్ ప్రాజెక్టు కింద మంజూరైన మొద‌టి విడ‌త నిధుల‌లో భాగంగా ఖ‌రారైన ప‌నుల‌ను స్వ‌యంగా మంత్రి ఎర్ర‌బెల్లి, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, ఆయా శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ప‌ర్వ‌త‌గిరి ఊర‌ చెరువు వ‌ద్ద మొక్క‌లు నాటి క‌ట్ట‌ను ప‌రిశీలించారు. […]

Update: 2020-07-10 05:37 GMT

దిశ, వరంగల్: రూర్బ‌న్ ప్రాజెక్టు, ప‌ర్వ‌త‌గిరి అభివృద్ధికి ప‌క్కాగా స‌రిపోతుంద‌ని, అన్నారం షరీఫ్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌లు రూపొందించినట్టు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. రూర్బ‌న్ ప్రాజెక్టు కింద మంజూరైన మొద‌టి విడ‌త నిధుల‌లో భాగంగా ఖ‌రారైన ప‌నుల‌ను స్వ‌యంగా మంత్రి ఎర్ర‌బెల్లి, వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్, ఆయా శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ప‌ర్వ‌త‌గిరి ఊర‌ చెరువు వ‌ద్ద మొక్క‌లు నాటి క‌ట్ట‌ను ప‌రిశీలించారు. చెరువుని విశాలం చేయాల‌న్నారు. వ‌చ్చే ఏడాది నుంచి ద‌స‌రా ఉత్స‌వాలు ఇక్క‌డే జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ… రూర్బ‌న్ ప్రాజెక్టు‌ కింద మొద‌టి విడ‌త‌గా రూ.30 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. ఈ నిధుల‌తో ప‌ర్వ‌త‌గిరి ప్రాంతాన్ని అభివృద్ధి ప‌ర‌చాల‌నేదే లక్ష్యమన్నారు. అన్నారం గ్రామానికి ద‌ర్గా ద‌ర్శ‌నార్థం లక్ష‌లాది మంది భ‌క్తులు వ‌స్తుంటారని, వాళ్ళంద‌రికీ స‌రైన స‌దుపాయాలు క‌ల్పిస్తామన్నారు. స్థానిక ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో అన్నారం రోడ్డు పొడ‌వునా ష‌ట్ట‌ర్లు, మాంసం కేంద్రం క‌బేళా, స్కూల్ భ‌వ‌నాన్ని కొంత దూరంలో నిర్మించాల‌ని, ప్ర‌స్తుత స్కూల్ స్థ‌లంలో బ‌స్టాండ్ నిర్మించాల‌ని భావిస్తున్నామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యే అరూరి ర‌మేశ్ కృషితో వ‌చ్చిన రోడ్ల కార‌ణంగా కాస్త మెరుగైన స‌దుపాయాలు ఉన్నాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. గిరిజ‌న తండాల‌ను కూడా అభివృద్ధి ప‌ర‌చాల‌ని చూస్తున్నామ‌న్నారు. అలాగే ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఉపాధి, శిక్ష‌ణ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నామ‌న్నారు. ప్ర‌జావ‌స‌రాల‌కు అనుగుణంగా అభివృద్ధి, ప్ర‌ణాళిక‌ల‌తో ప‌నులు చేప‌డ‌తా‌మన్నారు. ప‌ర్వ‌త‌గిరిలో అధునాత‌న లైబ్ర‌రీ, మినీ స్టేడియం, జిమ్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. నిధుల కొర‌త లేద‌ని ప‌నులు కూడా వేగంగా పూర్తి చేస్తామ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

Tags:    

Similar News