‘నాడు.. నేడు తిరుగులేని నాయకుడు కేసీఆర్’

దిశ, తెలంగాణ బ్యూరో: నాడు.. నేడు తిరుగులేని నాయకుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో, రాష్ట్ర పాలనలో ఆయన పాత్ర అజరామరమని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్ పబ్లిక్ సర్వీస్ […]

Update: 2021-02-13 11:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నాడు.. నేడు తిరుగులేని నాయకుడు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో, రాష్ట్ర పాలనలో ఆయన పాత్ర అజరామరమని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ చైర్మన్ ప్రొఫెస్టర్ ఘంటా చక్రపాణి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. శనివారం మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బీసీ కమిషన్ పూర్వ సభ్యులు జూలూరు గౌరీశంకర్ రచించిన ‘ఒక్కగానొక్కడు’ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. సమైక్య పాలనలో వివక్షతకు, అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవ్వడాన్ని నిరసిస్తూ, స్వరాష్ట్ర తెలంగాణ సాధన కోసం ఉద్యమించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆరేళ్ళలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ భాషను, యాసను వెక్కిరించిన వాళ్లే, తెలంగాణ అభివృద్ధి చెందడం సాధ్యం కాదు అని విమర్శలు చేసినొళ్లే, ఇప్పుడు తెలంగాణ ప్రగతిని చూసి ‘ఔరా..’ అని పొగుడుతున్నారన్నారు. అసాధ్యాన్ని, సుసాధ్యం చేసిన ‘ఒక్కగానొక్కడు’ కేసీఆర్ అని వారు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, కాలే యాదయ్య, బీసీ కమీషన్ పూర్వ సభ్యులు ఈడిగా ఆంజనేయులు‌గౌడ్, రామానంద తీర్థ డైరెక్టర్ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News