ఇదే అదును.. చెరువుల‌ను నింపండి: మంత్రి

దిశ ప్రతినిధి, వరంగల్: ‘ఇదే మంచి అదును వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే అన్ని చెరువుల‌ను నింపండి. ప‌ర్వ‌త‌గిరి ఆవ‌కుంట చెరువుతోపాటు, ఊర చెరువు ఆధునీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయండి. ఆల‌స్యం కాకుండా జాగ్ర‌త్త వ‌హించాలి’ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఎస్సారెస్సీ, నీటిపారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం మంత్రి ప‌ర్వత‌గిరిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు. అనంత‌రం ప‌ర్వ‌త‌గిరి వాగు, ప్ర‌కృతి వ‌నం స్థ‌లాన్ని వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్, […]

Update: 2020-08-17 04:19 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: ‘ఇదే మంచి అదును వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌గానే అన్ని చెరువుల‌ను నింపండి. ప‌ర్వ‌త‌గిరి ఆవ‌కుంట చెరువుతోపాటు, ఊర చెరువు ఆధునీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయండి. ఆల‌స్యం కాకుండా జాగ్ర‌త్త వ‌హించాలి’ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఎస్సారెస్సీ, నీటిపారుద‌ల శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం మంత్రి ప‌ర్వత‌గిరిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆయా శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు. అనంత‌రం ప‌ర్వ‌త‌గిరి వాగు, ప్ర‌కృతి వ‌నం స్థ‌లాన్ని వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్, అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, వానా కాలం కావ‌డంతో ఇప్ప‌టికే ప‌ర్వ‌త‌గిరి మండ‌లంలోని ఎస్పారెస్పీ ప‌రిధిలోని 33 చెరువులు, నీటిపారుద‌ల శాఖ ప‌రిధిలోని 64 చెరువులు కొంత మేర‌కు నిండాయ‌న్నారు. నిండ‌ని చెరువుల‌కు అటు ఎస్పారెస్పీ, ఇటు నీటిపారుద‌ల శాఖ‌ల అధికారులు వారి వారి ప‌రిధిలో అన్నింటినీ నీటితో నింపాల‌ని మంత్రి ఆదేశించారు. ఆవ‌కుంట‌కు నీరు రావ‌డానికి ఫీడ‌ర్ చాన‌ల్, సైడ్ వాల్ కట్ట‌డం ద్వారా అద‌నంగా వ‌చ్చే నీటికి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు.

ఫీడ‌ర్ చాన‌ల్ పున‌రుద్ధ‌ర‌ణ పై దృష్టి సారించాల‌న్నారు. అలాగే రూర్బ‌న్ ప‌థ‌కం కింద‌ ప‌ర్వ‌త‌గిరి చెరువు ఆధునీక‌ర‌ణ ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్నారు. మ‌రో రెండు నెల‌ల్లో ప‌నులు ప్రారంభం కావాల‌ని ఆదేశించారు. ప‌ర్వ‌త‌గిరి ప్ర‌కృతి వ‌నంలో ఫెన్సింగ్, మొక్క‌లు నాట‌డం, వాటిని సంర‌క్షించ‌డం వంటి చ‌ర్యలు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. క‌ల్లెడ రోడ్డును పరిశీలించిన మంత్రి వెంట‌నే రిపేర్లు చేయించాల‌ని అక్క‌డ ఉన్న అధికారుల‌ను ఆదేశించారు. సాధ్య‌మైనంత తొంద‌ర‌లో రోడ్డు ప‌ని పూర్తి కావాల‌న్నారు.

Tags:    

Similar News