అధికారులకు మంత్రి ఆర్డర్స్.. ఏమనిఅంటే?

దిశ, వ‌రంగ‌ల్: అభివృద్ధి ప‌నులు ఆల‌స్య‌మైతే క్ష‌మించేది లేదని.. నిర్ణీత గ‌డ‌వులోగా ఆయా ప‌నులు పూర్త‌వ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌రేట్‌లో పలు అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు కష్టపడాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక నిధులు వస్తున్నాయని.. వాటిని సద్వినియోగం చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం, రోడ్లు, కాలువల […]

Update: 2020-07-09 04:53 GMT

దిశ, వ‌రంగ‌ల్: అభివృద్ధి ప‌నులు ఆల‌స్య‌మైతే క్ష‌మించేది లేదని.. నిర్ణీత గ‌డ‌వులోగా ఆయా ప‌నులు పూర్త‌వ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌రేట్‌లో పలు అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు కష్టపడాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం అనేక నిధులు వస్తున్నాయని.. వాటిని సద్వినియోగం చేసే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం, రోడ్లు, కాలువల మరమత్తులపై మంత్రి సమీక్షించారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లు జాప్యం చేస్తే.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News