ఎంత జాగ్రత్త పడ్డా… వ్యాప్తి ఆగడం లేదు
దిశ, పాలకుర్తి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా వ్యాప్తి ఆగడం లేదని, ప్రజల్లో మరింత అవగాహన పెంచి అప్రమత్తం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మరోవైపు అభివృద్ధి పనులను కూడా ఆపకుండా వేగవంతం చేద్దామని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాని కంటే ముందే మేలుకొని అనేక చర్యలు […]
దిశ, పాలకుర్తి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా వ్యాప్తి ఆగడం లేదని, ప్రజల్లో మరింత అవగాహన పెంచి అప్రమత్తం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మరోవైపు అభివృద్ధి పనులను కూడా ఆపకుండా వేగవంతం చేద్దామని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కరోనా పరిస్థితులు, అభివృద్ధి పనులపై పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాని కంటే ముందే మేలుకొని అనేక చర్యలు చేపట్టిందని, లాక్‌డౌన్ విధించి ఆర్థిక భారాలను సైతం ఓర్చి, అభివృద్ధి పనులను ఆపలేదన్నారు. పైగా, రైతాంగానికి కూడా రైతుబంధు సహా, కల్లాలు, రైతు వేదికలు, రూ.25 వేల రుణాల మాఫీ వంటి అనేక చర్యలు చేపట్టిందన్నారు. కరోనా బాధితుల కోసం పరీక్షలు, చికిత్సలు, పౌష్టికాహారం అందిస్తున్నదని ఇంత చేసినా విస్తృతి ఇంకా పెరుగుతూనే ఉందన్నారు. నగరాలకే పరిమితమైన వైరస్ ఇప్పుడు పట్టణాలు దాటి పల్లెలకు పాకిందన్నారు. ఇప్పుడిక మనమంతా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇక నుంచి తానూ స్వయంగా మండల, గ్రామాల ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ మేరకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, ఇతర నేతల ఫోన్ నెంబర్లతో కూడిన ఒక జాబితాను సిద్ధం చేశారు.
జూన్ నెలలో పాలకుర్తి నియోజకవర్గంలో భారీగా మాస్కులను పంపిణీ చేశామని, అదే తరహాలో త్వరలోనే 4 లక్షల మాస్కులను పంపిణీ చేయనున్నామని తెలిపారు. మంత్రి సతీమణి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు నేతృత్వంలో నడుస్తున్న ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో త్వరలోనే పాలకుర్తి నియోజకవర్గానికి రెండు అంబులెన్సు వాహనాలను ఇవ్వనున్నట్టు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు.