ఇక ఎవరిని క్షమించం.. ఆలస్యం చేస్తే అంతే..
దిశ ప్రతినిధి, వరంగల్: సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్వరలో పూర్తి చేయాలని, పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులోకి చేర్చుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. అలాగే కల్లాలు, రైతు వేదికల నిర్మాణానికి గడువు ముగిసినందున మరో వారం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల పరిధిలోని పలు అభివృద్ధి పనులపై మంత్రి సంబంధిత శాఖల జిల్లా, స్థానిక అధికారులు, ప్‌నజాప్రతినిధులు, రైతు సమన్వయ […]
దిశ ప్రతినిధి, వరంగల్: సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్వరలో పూర్తి చేయాలని, పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులోకి చేర్చుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. అలాగే కల్లాలు, రైతు వేదికల నిర్మాణానికి గడువు ముగిసినందున మరో వారం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల పరిధిలోని పలు అభివృద్ధి పనులపై మంత్రి సంబంధిత శాఖల జిల్లా, స్థానిక అధికారులు, ప్‌నజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రగతిలో ఉన్న వివిధ పథకాల పనులను వేగం చేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో మందగించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బకొడుతూ, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంలో అలక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టుల్లోకి పంపిస్తామని హెచ్చరించారు. ఆయా బెడ్ రూం ఇండ్లను వేగంగా పూర్తి చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సూచించారు. ఇప్పటికే అనేకసార్లు కావాల్సినంత సమయం ఇచ్చామని, ఇంకా ఆలస్యం చేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు.