గల్లీయే కాదు.. ఢిల్లీలోనూ కోట్లాడుతాం : మంత్రి ఎర్రబెల్లి
దిశ, వర్థన్నపేట : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న తీరుపై రైతుల పక్షాన గల్లీలోనే కాదు, ఢిల్లీలో ధర్నా చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా వర్థన్నపేట, రాయపర్తి మండల కేంద్రంలో రైతుల కోసం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను ఆగం చేయాలని చూస్తుందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే వరి […]
దిశ, వర్థన్నపేట : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న తీరుపై రైతుల పక్షాన గల్లీలోనే కాదు, ఢిల్లీలో ధర్నా చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా వర్థన్నపేట, రాయపర్తి మండల కేంద్రంలో రైతుల కోసం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను ఆగం చేయాలని చూస్తుందన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి లెటర్ తీసుకురావాలన్నారు.
రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ రైతుల కోసం 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు తీసుకు వచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు పంట పండించడానికి చుక్క నీరు కూడా రాలేదన్నారు. గత యాసంగిలో కొనుగోలు చేసిన వడ్లు గోదాములు, రైస్ మిల్లులలో నిల్వ ఉన్నాయన్నారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ రెండేళ్లుగా ఓపిక పట్టారన్నారు. కేంద్రం విధానాలను అర్థం చేసుకున్న ప్రజలు బీజేపీ లీడర్లను రోడ్లపై ఉరికించి కొడతారన్నారు. కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించి రైతుల నుంచి ఏడాదికి లక్ష రూపాయలు వసూలు చేయాలని కేంద్రం చూస్తోందన్నారు.
కార్యక్రమంలో వర్థన్నపేట శాసన సభ్యులు ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీ బ్యాంకు ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ అంగోత్ అరుణ, వర్థన్నపేట రాయపర్తి ఎంపీపీలు అప్పారావు, అనిమి రెడ్డి, జడ్పీటీసీలు మార్గం బిక్షపతి, రంగు కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.