వలస కూలీల మృతిపై సమగ్ర విచారణ
దిశ, వరంగల్ వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన 9 మంది వలస కూలీల మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని, త్వరలోనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎంజీఎం దవాఖానా వద్ద చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ […]
దిశ, వరంగల్
వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట వద్ద బావిలో పడి చనిపోయిన 9 మంది వలస కూలీల మృతికి గల కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని, త్వరలోనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఎంజీఎం దవాఖానా వద్ద చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఇతర నేతలు, అధికారులతో కలిసి మృతదేహాలను పరిశీలించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కరోనా కట్టడికి లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ఏ ఒక్క వలస కార్మికుడు ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి అన్ని రకాలుగా అండగా ఉన్నారన్నారు. కానీ, 9మంది వలస కార్మికులు చనిపోవడం దురదృష్టకరమన్నారు.వీరి మృతికి గల కారణాలపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారని, పోస్టు మార్టం నివేదిక వచ్చాక నిజానిజాలు తెలుస్తాయన్నారు.దీనికి బాధ్యులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు తేల్చిచెప్పారు. బీహార్‌కు చెందిన మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని, వారు తీసుకెళ్లడానికి వస్తే అన్ని విధాల సహకరిస్తామని, లేనియెడల వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తామన్నారు.కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి సత్యవతి రాథోడ్ వ్యక్తిగతంగా రూ.లక్ష , చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.