మహిళ సాధికారతే లక్ష్యం
దిశ వెబ్ డెస్క్: మహిళ సాధికారత, స్వయం సమృద్దే లక్ష్యంగా టీఆర్ ఎస్ సర్కార్ పనిచేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజేంద్ర నగర్ టీఎస్ ఐపాస్ లో పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహించిన వర్క్ షాప్ నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, దేవాదుల వంటి పలు ప్రాజెక్టులతో జలవిప్లవం వచ్చిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, […]
దిశ వెబ్ డెస్క్: మహిళ సాధికారత, స్వయం సమృద్దే లక్ష్యంగా టీఆర్ ఎస్ సర్కార్ పనిచేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజేంద్ర నగర్ టీఎస్ ఐపాస్ లో పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహించిన వర్క్ షాప్ నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, దేవాదుల వంటి పలు ప్రాజెక్టులతో జలవిప్లవం వచ్చిందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు వంటివి అందిచడంతో రాష్ట్రంలో కోటీ ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్దికి, వాటి విస్తరణకు సెర్ఫ్ కృషి చేయాలని అన్నారు.
మహిళ సాధించే దిశగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు అహార పరిశ్రమల వృద్దికి సెర్ప్ తోడ్పడలన్నారు. వాటిలో మహిళలను భాగస్వాములు చేసి తెలంగాణ స్వయం సంవృద్ధి సాధించేలా కృషి చేయాలని అధికారులను ఎర్రబెల్లి ఆదేశించారు.