రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత లేదు : ఈటల

దిశ, ముషీరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వేగవంతంగా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోందని తెలిపారు. వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు. టీకా వేసుకోవడం పట్ల ఇలాంటి అపోహలు వద్దని, అందరూ టీకా వేసుకోవాలని ఆయన సూచించారు. 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని […]

Update: 2021-04-11 10:56 GMT

దిశ, ముషీరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వేగవంతంగా వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోందని తెలిపారు. వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు. టీకా వేసుకోవడం పట్ల ఇలాంటి అపోహలు వద్దని, అందరూ టీకా వేసుకోవాలని ఆయన సూచించారు. 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిపైనే అది అధికంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. స్వీయ రక్షణ తోనే కరోనాను నిలువరించవచ్చునని అన్నారు.

Tags:    

Similar News