కరోనా టెస్టుల్లో తెలంగాణ లాస్ట్ నుంచి ఫస్ట్

దిశ, మహబూబ్ నగర్: దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్రం కరోనా టెస్టులు చేయడంలో పూర్తిగా వెనకబడిందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు.మన పక్క రాష్ట్రం తమిళనాడు 5లక్షల 28వేలు పైగా టెస్టులు చేస్తే, మహారాష్ట్ర 4 లక్షల 98వేలు టెస్టులు చేసిందని కానీ, మన రాష్ట్రంలో మాత్రం కేవలం 40వేల టెస్టులు మాత్రమే చేయడం ఎంటనీ ప్రశ్నించారు. రాష్ట్రంలో డాక్టర్ల ప్రాణాలకే ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోతుందని, ప్రభుత్వ వైఫల్యం మూలంగా నేడు […]

Update: 2020-06-06 05:59 GMT

దిశ, మహబూబ్ నగర్: దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే రాష్ట్రం కరోనా టెస్టులు చేయడంలో పూర్తిగా వెనకబడిందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు.మన పక్క రాష్ట్రం తమిళనాడు 5లక్షల 28వేలు పైగా టెస్టులు చేస్తే, మహారాష్ట్ర 4 లక్షల 98వేలు టెస్టులు చేసిందని కానీ, మన రాష్ట్రంలో మాత్రం కేవలం 40వేల టెస్టులు మాత్రమే చేయడం ఎంటనీ ప్రశ్నించారు. రాష్ట్రంలో డాక్టర్ల ప్రాణాలకే ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోతుందని, ప్రభుత్వ వైఫల్యం మూలంగా నేడు తెలంగాణలో 68మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. శనివారం గద్వాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉస్మానియాలో 41 మంది డాక్టర్లు, గాంధీలో నలుగురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారని వివరించారు. నిమ్స్‌లో 12మంది డాక్టర్లు, 8 మంది పారామెడికల్ స్టాఫ్, డెంటల్ విద్యార్థులు ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ఒక్క ఆస్పత్రిలో కూడా కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేవని డీకే అరుణ మండిపడ్డారు.కరోనా నుంచి ప్రజలను కాపాడుతున్న డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు పీపీఈ కిట్స్, మాస్కులు అందుబాటులో లేవన్నారు. పరీక్షలు చేయటం, పీపీఈ, మాస్కులు ఇవ్వటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, మంత్రి ఈటల చెబుతోన్న 10 లక్షల పీపీఈ కిట్స్ ఎక్కడ పోయాయో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెడ్తోందని, డాక్టర్లు, నర్సులు ఆరోగ్యం కోసం నియమించిన త్రిసభ్య కమిటీ రిపోర్ట్ ఎటు పోయిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్ని మాస్కులు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన గచ్చిబౌలి హాస్పిటల్‌లో కనీస సౌకర్యాలు లేవని ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

Tags:    

Similar News