వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎర్రబెల్లి
దిశ, వరంగల్: వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఆయన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడదామని మంత్రితో కలిసి ఎంజీఎం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని అన్నారు. […]
దిశ, వరంగల్: వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఆయన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం పీపీఈ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నిర్మూలనకు కలిసికట్టుగా పోరాడదామని మంత్రితో కలిసి ఎంజీఎం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన, వైద్య సేవలు అందించాలని కోరారు. టెలీ మెడిసిన్ సేవలను అందిస్తుండటం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సహకారం, దాతల సాయంతో ఎంజీఎం వైద్యశాలలో మరిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు ప్రభుత్వానికి, పోలీసులకు, వైద్యులకు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర కమిషనర్ పమేలా సత్పతి, ఎంజీఎం సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags : Minister Dayakar Rao, distributes, PPE kits, Warangal, MGM Hospital