సంకల్ప జ్యోతిని వెలిగిద్దాం.. ఐక్యమత్యం చాటుదాం

దిశ మెదక్: ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు.. ఈనెల 5న రాత్రి 9 గంటలకు జిల్లా ప్రజలంతా దీపాలు వెలిగించాలని మంత్రి హరీష్ రావు కోరారు. కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసిన మహమ్మారిపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని మంత్రి ఆకాంక్షించారు. జనతా కర్ఫ్యూ రోజున చప్పట్లతో చాటి చెప్పిన స్ఫూర్తిని […]

Update: 2020-04-04 08:09 GMT

దిశ మెదక్: ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు.. ఈనెల 5న రాత్రి 9 గంటలకు జిల్లా ప్రజలంతా దీపాలు వెలిగించాలని మంత్రి హరీష్ రావు కోరారు. కరోనా వైరస్‌పై పోరుకు సంఘీభావ సంకేతంగా, ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసిన మహమ్మారిపై చేస్తున్న గొప్ప పోరాటం స్ఫూర్తిమంతంగా సాగాలని మంత్రి ఆకాంక్షించారు. జనతా కర్ఫ్యూ రోజున చప్పట్లతో చాటి చెప్పిన స్ఫూర్తిని మరోసారి ప్రతి ఇంటి ముందు దీపాలతో ప్రదర్శించాలని కోరారు. మనందరి ఐక్యతకు అద్ధం పట్టే విధంగా నలు దిశలా వెలుగులు విరాజిమ్మలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Tags: minister harish rao, called, sankalpa jyothi, medak

Tags:    

Similar News