బాపూ మ్యూజియంలో అరుదైన వస్తువులు -అవంతి
దిశ వెబ్ డెస్క్: విజయవాడ బాపు మ్యూజియంను బుధవారం ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. రూ.11 కోట్లతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాపు మ్యూజియంలో శిలా సంపద చాలా ఉందన్నారు. అత్యంత అరుదుగా దొరికే ప్రాచీన వస్తువులను మనం ఇక్కడ చూడవచ్చన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు మన పెద్దలు మనకిచ్చిన సంపద అని తెలిపారు. రాబోయే తరాలకి ఈ ప్రాచీన సంపదను అందించడం మన బాధ్యత అని సూచించారు. మ్యూజియంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా […]
దిశ వెబ్ డెస్క్: విజయవాడ బాపు మ్యూజియంను బుధవారం ఏపీ టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ సందర్శించారు. రూ.11 కోట్లతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాపు మ్యూజియంలో శిలా సంపద చాలా ఉందన్నారు. అత్యంత అరుదుగా దొరికే ప్రాచీన వస్తువులను మనం ఇక్కడ చూడవచ్చన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు మన పెద్దలు మనకిచ్చిన సంపద అని తెలిపారు. రాబోయే తరాలకి ఈ ప్రాచీన సంపదను అందించడం మన బాధ్యత అని సూచించారు. మ్యూజియంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ వస్తే ప్రతి ఒక్కరూ బాపు మ్యూజియంను సందర్శించేలా దీనిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.