ఏలూరు గాంధీ విద్యాలయాన్ని అభివృద్ధి చేస్తా
దిశ, ఏపీ బ్యూరో: ఎంతో చరిత్ర ఉన్న ఏలూరు గాంధీ జాతీయ మహా విద్యాలయం అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటానని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్న ఈ విద్యాలయం అభివృద్ధి కోసం పాలక వర్గం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం గాంధీ మహా విద్యాలయం కమిటీ చైర్మన్ పటగర్ల రామ్మోహన్ రావు, వంకాయల రామకృష్ణ, పాలకవర్గ […]
దిశ, ఏపీ బ్యూరో: ఎంతో చరిత్ర ఉన్న ఏలూరు గాంధీ జాతీయ మహా విద్యాలయం అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటానని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తున్న ఈ విద్యాలయం అభివృద్ధి కోసం పాలక వర్గం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం గాంధీ మహా విద్యాలయం కమిటీ చైర్మన్ పటగర్ల రామ్మోహన్ రావు, వంకాయల రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు మంత్రిని కలిశారు. ఈ విద్యాలయానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు త్వరగా మంజూరయ్యేట్లు చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హామీ ఇచ్చారు.