‘అక్కడ చికిత్స చేస్తున్న డాక్టర్లు ఎవరు’

దిశ, వెబ్‌డెస్క్: స్వర్ణ ప్యాలెస్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎవరని మంత్రి ఆళ్లనాని అధికారులను ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై ఏపీ మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. నోడల్ ఆఫీసర్ ఎవరూ, ఎక్కడ ఉన్నారని మండిపడ్డారు. రిజిస్టర్ నిర్వహణపై ఆయన ఆరా తీశారు. బాధితుల వివరాలను సమగ్రంగా రికార్డు చేస్తున్నారా అని అధికారులను ఆళ్లనాని సూటిగా ప్రశ్నించారు. ఉదయం 4:45 గంటలకు ప్రమాదం జరిగిందని గుర్తు చేసిన మంత్రి ఆళ్లనాని.. అగ్ని […]

Update: 2020-08-09 06:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వర్ణ ప్యాలెస్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఎవరని మంత్రి ఆళ్లనాని అధికారులను ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై ఏపీ మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. నోడల్ ఆఫీసర్ ఎవరూ, ఎక్కడ ఉన్నారని మండిపడ్డారు. రిజిస్టర్ నిర్వహణపై ఆయన ఆరా తీశారు. బాధితుల వివరాలను సమగ్రంగా రికార్డు చేస్తున్నారా అని అధికారులను ఆళ్లనాని సూటిగా ప్రశ్నించారు.

ఉదయం 4:45 గంటలకు ప్రమాదం జరిగిందని గుర్తు చేసిన మంత్రి ఆళ్లనాని.. అగ్ని మాపక సిబ్బందికి ఉ. 5:09 కి కాల్ వెళ్లిందని చెప్పారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చాయని ఆయన వివరణ ఇచ్చారు. అయినా.. పదిమంది కొవిడ్ పేషంట్లు చనిపోవడం బాధాకరమన్నారు. ఇందులో ముగ్గురు మహిళ పేషంట్లు మృతి చెందరన్నారు. మరో 15 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని వారికి ఎటువంటి ప్రమాదం లేదని ఆళ్లనాని స్పష్టం చేశారు.

Tags:    

Similar News