పబ్లిక్ ఇష్యూకు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌స్టోన్, కె రహేజా గ్రూపులకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) పబ్లిక్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. అలాగే, 29న ముగియనుంది. ఇష్యూ ధరను రూ. 274- రూ. 275గా నిర్ధారించారు. రిటైల్ ఇన్వెస్టర్లు మినిమం 200 యూనిట్లకు బిడ్ వేయాల్సి ఉంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే మైండ్‌స్పేస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు పబ్లిక్ ఇష్యూలో భాగంగా […]
దిశ, వెబ్‌డెస్క్: బ్లాక్‌స్టోన్, కె రహేజా గ్రూపులకు చెందిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ(రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్) పబ్లిక్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. అలాగే, 29న ముగియనుంది. ఇష్యూ ధరను రూ. 274- రూ. 275గా నిర్ధారించారు. రిటైల్ ఇన్వెస్టర్లు మినిమం 200 యూనిట్లకు బిడ్ వేయాల్సి ఉంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
ఇప్పటికే మైండ్‌స్పేస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 3500 కోట్ల విలువైన యూనిట్లను అమ్మేందుకు సిద్ధమయ్యారు. మరో రూ. వెయ్యి కోట్లను కంపెనీ విక్రయానికి ఉంచనుంది. పబ్లిక్ ఇష్యూలో సంస్థాగత ఇన్వెస్టర్లకు 75 శాతాన్ని, రిటైలర్లకు 25 శాతాన్ని విక్రయించేందుకు మైండ్‌స్పేస్ బిజినెస్ కంపెనీ పత్రాల్లో వెల్లడించింది. ఇక, వ్యూహాత్మక కంపెనీలు, యాంకర్ పెట్టుబడులతో ఇటీవల మైండ్‌స్పేస్ కంపెనీ రూ. 2,644 కోట్లను సమీకరించగలిగింది.
ఇందులో సింగపూర్ సావరిన్ ఫండ్, ఫెడిలిటీ గ్రూప్, కేపిటల్ గ్రూప్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలున్నాయి. ఈ విక్రయాల ద్వారా మైండ్‌స్పేస్ 58.74 శాతాన్ని విక్రయించినట్టుగా అయింది. దీంతో తాజా పబ్లిక్ ఇష్యూ నుంచి రూ. 1,856 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కాగా, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్‌లో ప్రమోటర్లు రహేజా గ్రూప్‌తో సహా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ కూడా పెట్టుబడులు పెట్టింది.
తాజా విక్రయాల ద్వారా వచ్చే మొత్తాన్ని రుణాల చెల్లింపులకు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. సెబీ ముందు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌గా రిజిస్టర్ చేసుకున్న మైండ్‌స్పేస్ సంస్థ మొత్తం 295 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కలిగి ఉంది. హైదరాబాద్, ముంబై, చెన్నై, పూణెలలో రియల్టీ ఆస్తులను కొనసాగిస్తోంది. రానున్న రోజుల్లో మరో 28 లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేసేందుకు కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.