‘ఐ వాంట్ హమాలి జాబ్’.. లక్షల్లో దరఖాస్తులు
దిశ నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పై చేసిన చులకన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఖంగుతిన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనలు చేయడం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన కుదరడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. స్వరాష్ట్రం కోసం రబ్బరు బుల్లెట్లు, పోలీసు లాఠీ దెబ్బలకు సైతం తట్టుకొని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనూ నిరుద్యోగులకు […]
దిశ నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిరుద్యోగుల పై చేసిన చులకన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఖంగుతిన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 50వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనలు చేయడం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన కుదరడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. స్వరాష్ట్రం కోసం రబ్బరు బుల్లెట్లు, పోలీసు లాఠీ దెబ్బలకు సైతం తట్టుకొని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనూ నిరుద్యోగులకు అవమానమే ఎదురవుతోందని చివరికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హమాలి ఉద్యోగానికి నేరుగా దరఖాస్తు పెట్టుకుంటున్నారు. “ఐ వాంట్ హమాలి జాబ్” అంటూ ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు.
We Want Hamali Job.@SingireddyTRS @TelanganaCMO @trspartyonline pic.twitter.com/2Gdu7K5JJY
— SHANKAR JANTHUKA (@SJanthuka) July 16, 2021