మరో షాక్.. త్వరలో పెరగనున్న పాల ధర!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాల ధరలు పెరగనున్నాయి. రాష్ట్రంలో వివిధ పాల డెయిరీల ప్రతినిధులు ఇటీవల సమావేశమై లీటరుకు కనీసంగా రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించారు. డీజిల్ ధరల పెంపుతో రవాణా భారం పెరిగిందని, వాటిని అధిగమించేందుకు మరో మార్గం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. అన్ని డెయిరీలు ఒకే ఆలోచనతో ఉన్నందున ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో టోన్డ్ మిల్క్ లీటరుకు దాదాపు రూ.50, క్రీమ్ మిల్కు దాదాపు […]

Update: 2021-02-19 11:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా పాల ధరలు పెరగనున్నాయి. రాష్ట్రంలో వివిధ పాల డెయిరీల ప్రతినిధులు ఇటీవల సమావేశమై లీటరుకు కనీసంగా రెండు రూపాయలు పెంచాలని నిర్ణయించారు. డీజిల్ ధరల పెంపుతో రవాణా భారం పెరిగిందని, వాటిని అధిగమించేందుకు మరో మార్గం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. అన్ని డెయిరీలు ఒకే ఆలోచనతో ఉన్నందున ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో టోన్డ్ మిల్క్ లీటరుకు దాదాపు రూ.50, క్రీమ్ మిల్కు దాదాపు రూ.64గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధర పెరగడంతో పాల సరఫరాకు వినియోగిస్తున్న వాహనాల నిర్వహణ ఖర్చు పెరిగిందని అందువల్లే ధర పెంచాల్సి వస్తోందని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక డెయిరీ యజమాని వివరించారు.

Tags:    

Similar News