లొంగిపోతే.. ఉగ్యోగాలు కల్పిస్తాం..
దిశ, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలానికి చెందిన 12 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. జీకే వీధి మండలం రామగడ్డ గ్రామానికి చెందిన గెమ్మిలి భాస్కరరావు, మర్రి ప్రసాద్, పనసలబంధ గ్రామానికి చెందిన గెమ్మిలి అర్జున, నాగరాజు, ఆకులూరు గ్రామానికి చెందిన శివుడు కామేశ్వరరావు, నాగేశ్వరరావు, కిల్లో నీలంబర్, వంతల సుబ్బారావు, పాత్రునికుంట […]
దిశ, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలానికి చెందిన 12 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మీడియాకు వివరాలు వెల్లడించారు. జీకే వీధి మండలం రామగడ్డ గ్రామానికి చెందిన గెమ్మిలి భాస్కరరావు, మర్రి ప్రసాద్, పనసలబంధ గ్రామానికి చెందిన గెమ్మిలి అర్జున, నాగరాజు, ఆకులూరు గ్రామానికి చెందిన శివుడు కామేశ్వరరావు, నాగేశ్వరరావు, కిల్లో నీలంబర్, వంతల సుబ్బారావు, పాత్రునికుంట గ్రామానికి చెందిన కొర్ర బాబురావు, కిల్లో చిన్నారావు, పాంగి నాగేశ్వరరావు, కొర్ర నర్సింగారావులు స్వచ్ఛందంగా పోలీసులు చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోయినట్టు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో ఉన్న మిగిలిన మిలీషియా సభ్యలు సైతం లొంగిపోతే వారికి పోలీస్ శాఖ అన్నివిధాలుగా అండగా ఉంటుందని, పూర్తిస్థాయిలో ఉద్యో, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.