ఆగని ప్రయాణాలు..

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం మరో‌సారి లాక్‌డౌన్ గడువును మే 7వ తేదీ వరకు పొడిగించింది. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో తలదాచుకుంటున్న వలస కార్మికులు.. ఇక ఇక్కడ ఉండలేం అంటున్నారు. ‘కలోగంజో తాగి మా ఊళ్లోనే బతుకుతామని.. నెత్తిన మూటముల్లె, చంకన బిడ్డలతో బయల్దేరుతున్నారు. వీరికి ఇక్కడి నుంచి తమ ఊరు ఎంత దూరం ఉందో తెలియదు. ఇంటికి పోవడానికి ఎన్నిరోజులు పడుతుందో కూడా […]

Update: 2020-04-20 08:06 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ప్రభుత్వం మరో‌సారి లాక్‌డౌన్ గడువును మే 7వ తేదీ వరకు పొడిగించింది. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో తలదాచుకుంటున్న వలస కార్మికులు.. ఇక ఇక్కడ ఉండలేం అంటున్నారు. ‘కలోగంజో తాగి మా ఊళ్లోనే బతుకుతామని.. నెత్తిన మూటముల్లె, చంకన బిడ్డలతో బయల్దేరుతున్నారు. వీరికి ఇక్కడి నుంచి తమ ఊరు ఎంత దూరం ఉందో తెలియదు. ఇంటికి పోవడానికి ఎన్నిరోజులు పడుతుందో కూడా తెలియదు. కానీ ఇంటికి చేరుకోవాలన్న లక్ష్యమే.. వీరిని ప్రయాణం వైపు అడుగులు వేయిస్తోంది. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ షెల్టర్‌లో ఉన్న వందలాది మంది మహారాష్ట్రకు చెందిన వలస కార్మికులు తమ ఊళ్లకు బయలుదేరారు.

Tags : Migrant workers, Lockdown, Exhibition Grounds, Shelters, travelling

Tags:    

Similar News