గుత్తి క్వారంటైన్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటచేసుకుంది. పట్టణంలోని ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఉంచారు. ఈ నేపథ్యంలో 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న తమను స్వస్థలాకు పంపించాలని పోలీసులతో గొడవకు దిగ్గారు. ఇళ్లకు పంపించే వరకు భోజనం కూడా చేయమని వలస కూలీలు భీష్మించుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో క్వారంటైన్ […]
అనంతపురం జిల్లా గుత్తి క్వారంటైన్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటచేసుకుంది. పట్టణంలోని ఎస్కేడి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఉంచారు. ఈ నేపథ్యంలో 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న తమను స్వస్థలాకు పంపించాలని పోలీసులతో గొడవకు దిగ్గారు. ఇళ్లకు పంపించే వరకు భోజనం కూడా చేయమని వలస కూలీలు భీష్మించుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో క్వారంటైన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై వలస కార్మికులు చెప్పులు, రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో గుత్తి సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
Tags: gooty, quarantain centre, Extreme tension, Migrant laborers, ap news