గల్ఫ్ కంట్రీలో ఆగిన మరో గుండె..

దిశ బాల్కొండ: గల్ఫ్ కంట్రీలో పని కోసం వలన వెళ్లిన కార్మికులు ఈ మధ్యకాలంలో వరుస మరణాల బాట పడుతున్నారు.తాజాగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామానికి చెందిన దరవాస్తు హరిచరన్ (46) సోమవారం సౌదీలోని రియాద్‌లో గుండెపోటుతో మరణించారు. ఈయన సంవత్సరం కిందట ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్ళాడు. నిన్న సౌదీలోని రియాద్‌లో గుండె పొటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య వరలక్ష్మితో పాటు […]

Update: 2020-07-28 06:01 GMT

దిశ బాల్కొండ: గల్ఫ్ కంట్రీలో పని కోసం వలన వెళ్లిన కార్మికులు ఈ మధ్యకాలంలో వరుస మరణాల బాట పడుతున్నారు.తాజాగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామానికి చెందిన దరవాస్తు హరిచరన్ (46) సోమవారం సౌదీలోని రియాద్‌లో గుండెపోటుతో మరణించారు.

ఈయన సంవత్సరం కిందట ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్ళాడు. నిన్న సౌదీలోని రియాద్‌లో గుండె పొటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతునికి భార్య వరలక్ష్మితో పాటు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. అప్పులు బాగా అవ్వడంతో డబ్బుల సంపాదన కోసం వెళ్లిన ఇంటిపెద్ద ఇకలేరని తెలియడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యులు ఉన్నారు. అప్పులు తీరకపోగా, తాజా ఘటన వారిని మరింత ఇబ్బందుల పాలు చేసింది. ప్రభుత్వం చొరవ చూపి హరిచరన్ మృతదేహాన్నిస్వస్థలానికి రప్పించాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు.

Tags:    

Similar News