అనుమానాస్పద స్థితిలో వలస కార్మికుడు మృతి

దిశ, మహబూబ్ నగర్: ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఓ వలస కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మక్తల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన బోనబ సుఖండె (50) పనికోసం జిల్లాలోని మక్తల్‌కు వచ్చాడు. రెండ్రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు తోటి కార్మికుల పోలీసులకు వివరించారు. కాగా, పనిచేసే చోట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలి మరణించినట్టు ఇటుక బట్టీ యజమాని హరికృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు […]

Update: 2020-04-23 10:03 GMT

దిశ, మహబూబ్ నగర్: ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఓ వలస కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన గురువారం మక్తల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఒరిస్సాకు చెందిన బోనబ సుఖండె (50) పనికోసం జిల్లాలోని మక్తల్‌కు వచ్చాడు. రెండ్రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు తోటి కార్మికుల పోలీసులకు వివరించారు. కాగా, పనిచేసే చోట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలి మరణించినట్టు ఇటుక బట్టీ యజమాని హరికృష్ణ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కార్మిక చట్టం ప్రకారం పని చేయడానికి వచ్చిన కూలీలకు కాస్త నలతగా ఉన్నా వెంటనే వైద్యం చేయించాలనే నిబంధన ఉంది. కానీ, అవేవి పట్టించుకోకుండా ఎండలో పని చేయించడం వల్ల చనిపోయినట్టు తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: suspected, migrant labour died, mahabubnagar, brick manufacture, maktal

Tags:    

Similar News