కొవ్వూరులో వలస కూలీల ధర్నా
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీలు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమను స్వస్థలాలకు పంపించాలంటూ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా వలస కూలీలు కొవ్వూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని నచ్చజెప్పేందుకు యత్నించారు. వినిపించుకోని కూలీలు ఉపాధి కోల్పోయిన ఆవేశంతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కాగా, వలస కూలీలంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా […]
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీలు చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమను స్వస్థలాలకు పంపించాలంటూ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా వలస కూలీలు కొవ్వూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని నచ్చజెప్పేందుకు యత్నించారు. వినిపించుకోని కూలీలు ఉపాధి కోల్పోయిన ఆవేశంతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కాగా, వలస కూలీలంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పనిచేస్తుండగా, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tag: migraint workers, protest, west godavary, ap