న్యూ ఫీచర్స్‌తో ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’
దిశ, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ తమ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘టీమ్స్’ను యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో ఐదు కొత్త ఫీచర్లను అనౌన్స్ చేసింది. మరికొన్ని రోజుల్లో టీమ్స్ సరికొత్తగా ఉండబోతుందని కంపెనీ తెలిపింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫెసిలిటీని కల్పించాయి. కొవిడ్ మహమ్మారి ఎప్పటికి ఈ లోకాన్ని విడిచిపోతుందో తెలియని సందిగ్ధంలో ఫేస్‌బుక్, గూగుల్ […]
దిశ, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్ తమ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ‘టీమ్స్’ను యూజర్ల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో ఐదు కొత్త ఫీచర్లను అనౌన్స్ చేసింది. మరికొన్ని రోజుల్లో టీమ్స్ సరికొత్తగా ఉండబోతుందని కంపెనీ తెలిపింది.
కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఫెసిలిటీని కల్పించాయి. కొవిడ్ మహమ్మారి ఎప్పటికి ఈ లోకాన్ని విడిచిపోతుందో తెలియని సందిగ్ధంలో ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మెజారిటీ ఉద్యోగులకు 2020 మొత్తం ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సిందిగా ఆదేశాలిచ్చాయి. ట్విట్టర్ అయితే ఏకంగా పర్మింనెట్‌గా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
కరోనా విజృంభణ, లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఈ సంస్థలతో పాటు విద్యాలయాలు, కాలేజీలు, ఇతర కంపెనీలు కూడా తమ ఉద్యోగులతో కమ్యూనికేషన్ కోసం ‘వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్’లపైనే ఆధారపడ్డాయి. దీంతో ఆయా వీడియో యాప్‌ల మధ్య విపరీతమైన పోటీ వాతావరణం ఏర్పడింది. ఇందులో భాగంగానే.. జియోమీట్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ యాప్‌లు తమ కస్టమర్లను ఆకట్టకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ తమ టీమ్స్‌లో ‘టుగెదర్ మోడ్’, ‘డైనమిక్ వ్యూ’, ‘వీడియో ఫిల్టర్స్’, ‘లైవ్ రియాక్షన్స్’, ‘చాట్ బబుల్స్’, ‘స్పీకర్ అట్రిబ్యూషన్స్’ వంటి ఫీచర్లను తీసుకురాబోతుంది.
టుగెదర్ మోడ్:
వీడియో మీటింగ్స్‌కు రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందుకోసం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని వాడుకుంటోంది. ఏఐతో షేర్ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌లో అందరూ కనిపించడంతో.. ఒకే రూమ్‌లో లేదా క్లాస్‌లో(మీటింగ్‌లో) ఉన్న ఫీల్ కలుగుతుందని కంపెనీ చెబుతుంది. ఈ మోడ్ వల్ల మాటల్లో చెప్పలేని లేదా.. నాన్ వర్బల్ రియాక్షన్స్‌ను కూడా పార్టిసిపెంట్స్ అర్థం చేసుకోగలుగుతారు. ఆడిటోరియం వ్యూతో వచ్చే ‘టుగెదర్ మోడ్’ ఆగస్టులో అందరికీ అందుబాటులోకి రావచ్చని కంపెనీ తెలిపింది.
డైనమిక్ వ్యూ:
ఈ ఫీచర్ వల్ల.. యూజర్లు తమ ప్రిఫరెన్స్‌కు తగ్గట్లు.. స్క్రీన్‌ను పర్సనలైజ్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ పార్టిసిపెంట్స్‌ను మాత్రమే తమ సైడ్ బై సైడ్ వ్యూలో సెలెక్ట్ చేసుకునే సదుపాయం ఈ ఫీచర్‌లో ఉంది. వారితో కంటెంట్ కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
వీడియో ఫిల్టర్స్:
లైటింగ్ లెవల్స్, కెమెరా ఫోకస్‌లను అడ్జెస్ట్ చేసుకునేందుకు ఈ ఫిల్టర్స్‌ను ఉపయోగించుకోవచ్చు. మీటింగ్‌కు ముందు తమ అప్పియరెన్స్‌కు తగ్గట్లు ఈ ఫిల్టర్లను వాడుకోవచ్చు.
లైవ్ రియాక్షన్స్ :
టీమ్స్ యూజర్లు.. ఇకపై లైవ్ రియాక్షన్స్ ఫీచర్స్ వల్ల వర్చువల్‌గా కూడా రియాక్ట్ కావచ్చు. క్లాప్స్, హార్ట్, లాఫ్ ఇలాంటి ఎన్నో రియాక్షన్స్‌కు ఎమోజీలు ఈ ఫీచర్‌లో ఉంటాయి. సో యూజర్ల స్పందనకు అనుగుణంగా వాటిని వాడుకోవచ్చు. ఈ రియాక్షన్స్ యూజర్లందరికీ కనిపిస్తాయి. అంతేకాదు .. మరికొన్ని రోజుల్లో టీమ్స్‌లో లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ టూల్‌ను కూడా త్వరలో యాడ్ చేయబోతుంది.
చాట్ బబుల్స్:
వీడియో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ ఫీచర్‌తో ఈజీగా పార్టిసిపెంట్స్ చాట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏదైనా మెసేజ్ వస్తే.. యూజర్లు చాట్ బాక్స్ ఓపెన్ చేయాల్సి వచ్చేది. ఇక ఆ బాధ ఉండదు. చాట్ బబుల్స్ ఫీచర్‌తో చాట్స్ స్క్రీన్ మీదనే కనిపిస్తాయి. మీటింగ్‌లో ఉన్నవాళ్లందరికీ కనిపిస్తాయి.
స్పీకర్ అట్రిబ్యూషన్స్
ఈ ఫీచర్ వల్ల.. ఎవరో మాట్లాడుతున్నారో… అందరికీ తెలిసిపోతుంది. అంతేకాదు వచ్చే ఏడాది వరకు .. లైవ్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ట్రాన్స్‌లేషన్స్ కూడా మైక్రోసాఫ్ట్ తీసుకురాబోతుంది. దీని వల్ల భిన్నమైన భాషల్లో మాట్లాడినా… ఇతరులకు వాళ్లు చెప్పిందే అర్థం అవుతుంది.
1,000 పార్టిసిపెంట్స్ :
వీడియో మీటింగ్స్‌లో పార్టిసిపెంట్స్ లిమిట్‌ను కూడా పెంచేసింది. ప్రస్తుతం 1,000 మంది పార్టిసిపెంట్స్ చేయొచ్చు. అంతేకాదు ప్రజెంటేషన్ లేదా అనౌన్స్‌మెంట్స్ చేసేందుకు ‘వ్యూ ఓన్లీ మీటింగ్స్’ను ఉపయోగిస్తారు. తాజాగా దీని (వ్యూ ఓన్లీ మీటింగ్స్ ) లిమిట్‌ను 20 వేలకు పెంచారు.