త్వరలోనే మైక్రోసాఫ్ట్ ‘సర్ఫేస్ డుయో’

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజై నాలుగేళ్లు గడిచిపోయింది. 2014 నవంబర్ నెలలో స్మార్ట్‌ఫోన్‌ ‘లూమియా 535’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్.. ఆ తర్వాత లూమియా సిరీస్ నుంచి పలు ఫోన్లను లాంచ్ చేసింది. చివరగా 2016 ఫిబ్రవరిలో ‘లూమియా ‌650’ను తీసుకొచ్చిన కంపెనీ.. మళ్లీ ఇన్నేళ్లకు ‘సర్ఫేస్‌ డుయో’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. మైక్రోసాఫ్ట్ గతేడాది అక్టోబర్‌లో తన హార్డ్‌వేర్ సమావేశంలో ‘సర్ఫేస్ డుయో’ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం […]

Update: 2020-08-13 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజై నాలుగేళ్లు గడిచిపోయింది. 2014 నవంబర్ నెలలో స్మార్ట్‌ఫోన్‌ ‘లూమియా 535’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్.. ఆ తర్వాత లూమియా సిరీస్ నుంచి పలు ఫోన్లను లాంచ్ చేసింది. చివరగా 2016 ఫిబ్రవరిలో ‘లూమియా ‌650’ను తీసుకొచ్చిన కంపెనీ.. మళ్లీ ఇన్నేళ్లకు ‘సర్ఫేస్‌ డుయో’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతోంది.

మైక్రోసాఫ్ట్ గతేడాది అక్టోబర్‌లో తన హార్డ్‌వేర్ సమావేశంలో ‘సర్ఫేస్ డుయో’ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. డ్యుయల్ ఫోల్డబుల్ స్క్రీన్ కలిగిన సర్ఫేస్‌ డుయో స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 1,399 డాలర్లుగా ( రూ.1,04,700) ఉంటుందని కంపెనీ తెలిపింది. తొలుత ఈ ఫోన్లను అమెరికాలో విక్రయించాలని నిర్ణయించిన కంపెనీ.. తన అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 10న ప్రీ బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇన్నాళ్లుగా విండోస్ ఓఎస్‌తో వచ్చినా.. ఇప్పుడు రిలీజ్ చేస్తున్న డుయో మాత్రం.. ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రానుంది. సర్ఫేస్ డుయోకు ఉన్న రెండు స్క్రీన్‌లలో రెండు వేర్వేరు యాప్‌లను ఒకేసారి యాక్సెస్ చేయొచ్చు. స్క్రీన్‌ను 360 డిగ్రీల వరకు తిప్పవచ్చు.

ఫీచర్స్ :

డిస్ ప్లే : రెండు 5.6-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌లు
ప్రాసెసర్ : ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855
ర్యామ్ : 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128జీబీ
కెమెరా : 11 మెగాపిక్సెల్
బ్యాటరీ : రెండు 3,577 ఎంఏహెచ్
ధర : రూ. 1,04,700/-

Tags:    

Similar News